పాశ్చత్య నాగరికత వ్యామోహంలొ,జనవరి 1 వ తేది ని జరుపుకునే వుత్సాహం,మన "ఉగాది"ని జరుపుకోవడం లో లేదు.మన పిల్లలకి మన సంస్కృతి , సాంప్రదాయల, పండుగల విలువలు మనం నేర్పలేక పోతూ,మమ్మీ, డాడి సంస్కృతి లో వారిని పెంచుతున్నాం.మన సంస్కృతి , సాంప్రదాయం,సనాతన ధర్మం మరియు పండుగల గురించి చిన్నప్పటి నుండే పిల్లలకి తెలిసేలా చేయడం మన అందరి భాద్యత. ఆధ్యాత్మికత... అంటే అసలు ఏమిటి? దైవ చింతన. అయితే మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది.ఇలాంటి విషయాలన్నిటికి మరియు దేవుళ్ళకి సంబంధించిన ఇమేజస్, సాంగ్స్, స్త్రోత్రాలు,మొ!! ఆడియొ, వీడియో మరియు ఈ-బుక్స్ ....... అన్ని ఒక గొడుగు కింద కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీటికి సంబంధించినవి వివిధ వెబ్ సైట్ ల నుండి, స్నేహితులనుండి మరియు గ్రంధాల నుండి సేకరించడం జరుగుతోంది.ఇందులొ ఎక్కువ మంది భాగస్వాములు కావాలని కోరుతున్నాం.ఇక్కడ వుదహరించిన అంశాలలో మీ దగ్గర ఎటువంటి సమాచారం వున్నా,దిగువ తెలిపిన మా mail I D కి మీ వివరాలతో పాటు పంపితే, ఆ ఆర్టికల్ మీ వివరాలతో పోస్ట్ చేస్తాం.అలాగే జ్యోతిష్యం అత్యంత పురాతనమైన శాస్త్రం. జ్యోతిష్యం లో, పూజలు , వ్రతాలు చేస్తున్నప్పుడు కలిగే సందేహాలు, ఆధ్యాత్మికమైన ఎన్నో విషయాలలో కలిగే సందేహాలు .వీటిపై అవగాహన వున్న విశిష్ట వ్యక్తులు, గ్రంధాల ద్వారా నివృత్తి చేయబడుతుంది.మీరు మీ సందేహాలు మా గెస్ట్ బుక్ పేజి ద్వారా అడగవచ్చు.ఇలా మన సంస్కృతి, సాంప్రదాయలు, ఆధ్యాత్మిక , జ్యోతిష్య పరిజ్ఞానం కి సంభంధించిన ఒక చక్కటి వేదిక గా రూపుదిద్దాలనే సంకల్పం తో ఈ వేదిక ఏర్పటు చేయబడింది.ఇది కేవలం తొలి అడుగే . అందరి సహాయ సహకారాలతోసంస్కృతి, సంప్రదాయం, సనాతన హిందూ ధర్మం మరియు ఆధ్యాత్మికతల సమ్మేళనంతో ఒక విశిష్ట వేదిక అవ్వాలని ఆశిస్తున్నాం.
సలహాలకి, సూచనలకి మరియు సమాచారం కొరకు:
bhaktiprapamcham@gmail.com
No comments:
Post a Comment