Divine Knowledge


గణపతి రూప రహస్యం
గణపతి ఓంకార స్వరూపం. బృహస్పతి, బ్రహ్మణస్పతి కూడా గణపతియేనని వేదాలు చెప్తున్నాయి. ఆయనే పరతత్వం. గాణాపత్య మార్గంలో గణపతిని పరబ్రహ్మస్వరూపంగా భావించి పూజిస్తారు. జానపదులు పంటల దేవుడిగా పూజిస్తారు. ఖగోళ శాస్త్రంలో కూడా గణపతిని గూర్చిన ప్రస్తావన ఉంది. గణపతి తత్తా్వన్ని గురించి ఎన్ని రకాలుగా విశ్లేషించినా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టసాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సంపూర్ణమైన సృష్టికి ప్రతిబింబం. ఆయన జీవుడికి, దేహాత్మ భావనకు ప్రతీక. ఎందుకంటే గణపతి మూలాధారంలో ఉంటాడు. సమస్త శరీర భారాన్ని మోసేది మూలాధారం. సమస్త జీవకోటికి ఆధారభూతమైనది భూమి. గణపతి ఈ పృథ్వీతత్తా్వనికి ప్రతీక. కాబట్టే గణపతి స్వరూపం మనకు స్థూలంగా కనిపిస్తుంది. పదార్థం ఎప్పుడూ స్థూలంగానే ఉంటుంది. అందుకే గణపతి శరీరం భారీగా ఉంటుంది. పెద్ద జంతువు ముఖం, బానపొట్ట, భారీ కాయం.. వెరసి గణపతి స్వరూపం. అనంతమైన శూన్యం నుంచి మొదట పదార్థం ఉద్భవించింది. దాని నుంచి ప్రకృతి ఆవిర్భవించింది. ఆ ప్రకృతికి ప్రాణశక్తి లభించింది, దాని నుంచి జలచర, భూచరాదులతో కూడిన జీవజాలం పుట్టాయి. ఆ తరువాత మనస్సు కలిగిన మనిషి పుట్టడం. ఈ పరిణామక్రమానికంతటికీ గణపతి ప్రతిరూపంగా కనిపిస్తాడు. స్థూలకాయం పదార్థమైతే, గజముఖం విశ్వంలోని జీవజాలానికి చిహ్నం. అందుకే గణపతికి జంతువులలో అతి పెద్దదైన ఏనుగు ముఖం ఉంటుంది. ఆయన గజముఖుడయ్యాడు. దానితో పాటే మానవ శరీరాన్నీ గణపతి కలిగి ఉన్నాడు. ప్రకృతితో మమేకం అయ్యాడు కాబట్టి ఆయనను ప్రకృతిలోని సమస్తమైన పత్రాలతో, పూవులతో పూజిస్తారు. ఇంతటి మూర్తిమంతమైన శక్తికి దివ్యచైతన్యవంతం కావడం దైవత్వాన్ని సిద్ధించుకోవడం భారతీయ సంస్కృతిలోని ఒక విశేషమైన సంప్రదాయానికి, అపురూపమైన ఆధ్యాత్మిక భావ సంపదకు సంకేతం. ప్రతి మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది. ఇది అంతా అంగీకరించవలసిందే. పుట్టడం కష్టసుఖాలను అనుభవించడం నిర్లిప్తంగా లోకం నుంచి నిష్క్రమించడం జన్మ వృథా చేసుకోవడమే. ప్రపంచంలోని సమస్త జీవజాలంలో మనిషి మాత్రమే దివ్యచైతన్యాన్ని సాధించే దిశగా ఎదిగే సమర్థుడు. మానవుడు మానవుడిగా మాత్రమే కాక, దైవత్వాన్ని సాధించడం లక్ష్యంగా జీవించాలని గణపతి సూచిస్తున్నాడు.

ఇదే లక్షణాన్ని సమన్వయ పరుస్తూ గజాసుర వృత్తాంతం కూడా మన పురాణాల్లో ఉంది. గజాసుర సంహారార్థం పరమ శివుడు కైలాసం నుంచి తరలి వెళ్లిన సమయంలో పార్వతీ దేవి నలుగుపిండితో బాలుడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసిందిట. గజాసురుని వధించిన తరువాత తిరిగి వచ్చిన స్వామి, బాలకుడితో తగవుపడి అతడి శిరసును ఖండించగా, గజ ముఖాన్ని తీసుకువచ్చి తగిలించి పునఃప్రాణం పోశాడట. ఇందులోనూ పార్వతీపరమేశ్వరులు ప్రకృతి పురుషులు కాగా, నలుగుపిండి పదార్థానికి, గజముఖం జీవశక్తికి సంకేత రూపాలు.
సృష్టి ప్రారంభస్థానమైన మూలాధారానికి అధిపతి కావడం వల్లనే గణపతి తొలిపూజలందుకుంటున్నాడు. పృథ్విని ఆశ్రయించుకుని ఉండే పంచభూతాల నుంచి కలిగే విఘ్నాలను తొలగించే వాడు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడయ్యాడు. అంతే కాదు, సంపూర్ణమైన కుండలినీ శక్తికి గణపతి ప్రతీక. కుండలినీ శక్తి మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారం దాకా పైపైకి ఎదుగుతూ వస్తుంటుంది. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయకుడు ఈ కుండలినికి చిహ్నం. ఆయన నీటిలోంచి క్రమంగా కొద్ది కొద్దిగా పైకి ఎదుగుతూ వస్తుండటం ఇందుకు ప్రత్యక్ష తార్కాణం.
మనకు కలిగే ఆటంకాలను తొలగించే వాడు కాబట్టి ఆయనను సకల విఘ్న హరుడని కొలుస్తున్నాం. అయితే, ఆయన విఘ్నాలను తొలగించడమే కాదు.. విఘ్నాలను కల్పించేవాడని కూడా పౌరాణికులు చెప్తారు. మోక్షమార్గం వెళ్లాల్సిన జీవులు అపమార్గం పట్టకుండా ఉండేందుకు తానే అడ్డంకులను కల్పించి, ఆ జీవులను సక్రమమార్గంలో పెడతాడు కాబట్టి ఆయన విఘ్న హరుడు కాకుండా, విఘ్నాలకు అధిపతిగా పూజిస్తారు. అన్ని కాలాల్లో, అన్ని రుతువుల్లో, అన్ని పర్వదినాల్లో, సింహభాగం గణపతికే దక్కేది. శరీరానికి ఆధారభూతుడైన వాడు కాబట్టే ఆయనకు ఆ అగ్రతాంబూలం.



ఉపవాసాలు ఎందుకు పాటించాలి?
భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాతించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి.
తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పోరపాటు. ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం దీక్షలో మానసిక శద్దత్వం ఓ నియమంగా చెప్పబడింది. అలా మానసిక పారిశుద్దత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండెలేక అలమటించడమే అవుతుంది.
ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్టి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతభాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది. ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడంవల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు.
ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనస్సుకు ఎంతో ప్రయోజనకారి. ప్రార్ధనలు, ధ్యానం మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యమెనే శక్తిని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణవ్యవస్థని శుద్దచేస్తుంది. ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి. అలా శరీరానికి శుద్ధికూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి వున్న కొవ్వు మరియు ఇతరాలు ఉపవాసాలవల్ల తొలగిపోతాయి.
ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి.


విధవ గంగా భాగీరధీ సమానురాలు ఎలా అయింది?
భర్తను పోగొట్టుకొని అనాధ అయిన స్త్రీ పట్ల అందరూ పూర్వం కంటే మరింత పవిత్రతా భావంతో ప్రవర్తించాలన్న ఉద్దేశంతో మన పూర్వజులు విధవను గంగమ్మ తల్లితో సరిపోల్చారు. ఇక్కడ విధవ గంగతో సరిపోల్చబడింది కాని గంగను విధవతో సరిపోల్చినట్టు కాదు. భర్త చనిపోయాక మగదక్షత లేని విధవకు సామాజిక రక్షణ కలిగించే సదుద్దేశ్యంతో ఆమెకు గంగతో గంగతో సమానమైన పవిత్ర స్థానాన్ని ఆపాదించారు.
ఈ విషయంపై వేరొక కథనం కూడా ఉంది. "గంగ" అంటే 'భాగీరధీ" అన్న అర్ధమే గాక గంగా శబ్దాన్ని విశేషణంగా తీసుకుంటే "పూజ్యమైన" అన్న అర్ధం ఉంది. విధవ గంగా భాగీరధీ నదులంతటి పునీతమైనదన్న భావంతో విధవను గంగా భాగీరధీ సమానురాలని పూజ్యభావంతో వ్యవహరించడం అనూచానంగా వస్తున్న ఆచారం. ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది.

"గంగ" అంటే నీరు కదా! నిలువెల్లా నీరే అయిన గంగమ్మ పుణ్యస్త్రీ అయినా బొట్టు పెట్టుకోవడానికి ఆమెకు అవకాశం లేదు. ఆపాదమస్తకం శరీరమే నీరయినప్పుడు నీటిలో బొట్టు నిలిచేది ఎలా?? సృష్టిలో బొట్టు పెట్టుకో(లే)ని ఏకైక సుమంగళి గంగమ్మ తల్లి ఒక్కర్తే! భర్త ఉండీ, పునిస్త్రీ అయిన గంగకు, భర్తని
పోగొట్టుకుని బొట్టు పెట్టుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది విధవ. "బొట్టు" అంటే నుదుటను పెట్తుకునే "తిలకం" అనే కాదు. "పుస్తె,తాలిబొట్టు" అన్న అర్ధాలు కూడా ఉన్నాయి. బొట్టుకి, తాలిబొట్టుకి అంతటి అవినాభావ సంబంధం ఉంది. బొట్టు విషయంలో బొట్టు(తాళి) ఉన్న గంగకూ విధవకూ సామ్యమున్నది!

అందుకనే విధవను గంగా భాగీరధీ సమనురాలనడంలో ఔచిత్యం అర్ధం అవుతున్నది కదా!

హోరాకాలంలో చేయదగిన పనులు
ప్రతిదినం సూర్యోదయ సూర్యాస్తమయ కాలాన్ని బట్టి ఒక గంటకాలం కలుపు కొని ఫలం చూడాలి. సూర్యోదయ సూర్యాస్త మయ మధ్యకాలాన్ని 12 చే భాగించగా ఎంతకాలం (టైమ్‌) వచ్చునో చూసుకుంటూ 12 కాలాలు చూసి ఫలాన్ని తెలుసుకోవాలి. అలాగే రాత్రి కాలం - ఫలాన్ని చూసుకోవాలి. ఈ హోరాకాలం ఆపద అనే సముద్రాన్ని దాటించే పడవ వంటిది. ప్రయాణకాలంలో మంత్రిలాగా ఆలోచనలను తెలుపుతుంది. దీనికి మించిన శాస్తమ్రే లేదంటారు పెద్దలు. ప్రతిరోజు దీన్ని చూసి ప్రయాణించ డం సమస్త కార్యాలు చేయడం శుభం. శుభగ్రహ హోరలు శుభాన్ని, పాప గ్రహ హోరలు పాపఫలాన్ని ఇస్తాయి.
jathakam
గ్రహాలు - హోరఫలాలు
రవి: దావాలు, అప్పీళ్ళు చేయడానికి, ఉత్తరాలు, దస్తావేజులకు, నోట్లు వ్రాయడానికి, సన్మానాలు కోరడానికి, కొను టకు, తిరుగుటకు, ఉద్యోగం కొరకు అప్లికేష ను పెట్టడానికి మంచిది. న్యాయమైన పను లకు, రాజకీయ వ్యవహారాలు, అధికారులను కలుసుకోవడానికి, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యవహరాలకు మంచిది.
చంద్ర: గృహారంభం, గృహప్రవేశం, నగలు ధరించడం, ఒకరివద్ద కొత్తగా ప్రవేశించడా నికి, వ్యవసాయారంభం, తోటలు పాతడాని కి, స్ర్తీ సౌఖ్యం పొందడానికి, గొప్ప వారిని దర్శించడానిి, నీటి ప్రయాణం చేయడానికి, కొత్త పాత్రల్లో భుజించడానికి మంచిది. నౌకా యానం, వ్యాపారులు, ఉప్పు, ప్రత్తి, వెండి, కంచు, పశువులు, బెల్లం, పంచదార మొ తెల్లరంగు వస్తువులు కొనుటకు మంచిది.
కుజ: పాపగ్రహం, కష్టనష్టాలు, చిక్కులు కలుగుతుంటాయి. ఏ మంచిపని ఆరంభించ కూడదు. విఘాతం, రక్తదర్శనం అవుతుంది. యుద్ధాలకు, సాహసకృత్యాలకు, భూసం బంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి, సువర్ణ, తామ్ర, కంబళ, రస మొదలైన వస్తు వులు కొనడానికి మంచిది. ఇందుకు సంబం ధించిన వ్యాపారాలకు కూడా మంచిది.
బుధ: నూతన వర్తకం, దానికి సంబంధించిన వ్యాపారాలకు, విద్యకు సంబంధించిన పను లకు, సమస్త శుభకార్యాలకు, దస్తావేజులు మొదలైన వ్రాతపనులకు మంచిది. నూతన వ్యాపారం, ఆటలు, అప్పు తీర్చడం, ముద్రణ, సువర్ణం, వస్త్రాలు, ప్రత్తి, నూలు, చర్మం మొ వ్యాపారాలకు మంచిది.
గురు: పిల్లలకు సంబంధించిన ఉయ్యాలలో పెట్టడం, ముక్కు చెవులు కుట్టడానికి, శుభా లకు, గొప్పవారిని దర్శించి బహుమతులు పొందడానికి, ఉద్యోగ సంబంధమైన విషయా లు, బాకీలు వసూలు చేయడానికి ఏ వస్తువై నా కొనడానికి, లాటరీ పజిల్స్‌ వేయ డానికి, నూతన వస్త్రాలు ధరించడానికి, విద్యా సంబంధమైన సర్వకార్యాలకు మంచిది. వివా హం, ఉపనయనం, అప్పు తేవడం, తీర్చడం, గ్రంథరచన, ఉద్యోగంలో చేరడానికి, స్ర్తీ సౌఖ్యానికి మంచిది.
శుక్ర: సంబంధాలు నిశ్చయించడానికి, సంత కాలు పెట్టడానికి, ఔషధసేవకు, స్ర్తీలలో మెల గడానికి, రైలు ప్రయాణానికి, నూతన వస్త్రా లు ధరించడానికి, సమస్త శుభకార్యాలకు, నిశ్చయ తాంబూలాలకు మంచిది. ఈ హోర లో కొనుటకంటె ఏ వస్తువైనా అమ్మడం మం చిది. నువ్వులు, నూనె, మినుములు, ఇను ము, నేతి వస్తువులు మొ వ్యాపారానికి మంచిది.
శని: భూమి అమ్మడానికి చాలా మంచిది. తైల సంబంధ వ్యాపారాలకు శుభం. మిగతా ఏ వ్యాపారాలకూ పనికి రాదు. మధ్య శాలా రంభం, చౌర్యం, పొగా కు, దున్నలకు కాడి గట్టడం, తైల వ్యాపారా లు, గానుగ వేయడం, నీచవృత్తికి మంచిది.







గోవుని ఎందుకు పూజించాలి?



హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాం
గాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల
కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.



No comments:

Post a Comment